పోస్ట్‌లు

మార్చి, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు   ఏప్రిల్‌ 4వ తేదీన ప్రారంభమైంది. 26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లు ఏర్పడినాయి.  రెవెన్యూ డివిజన్ల సంఖ్య 51 నుండి 73కి పెరిగింది. పాత రెవెన్యూ డివిజన్‌లన్నీ యథాతథం. * జిల్లాల వారీగా రెవెన్యూ డివిజన్లు..* 1. శ్రీకాకుళం జిల్లా : పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం 2. విజయనగరం : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం 3. ప్వార్వతీపురం మన్యం : పార్వతీపురం, పాలకొండ 4. అల్లూరి సీతారామరాజు : పాడేరు, రంపచోడవరం 5. విశాఖపట్నం : భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం 6. అనకాపల్లి : అనకాపల్లి, నర్సీపట్నం,  7. కాకినాడ : పెద్దాపురం, కాకినాడ 8. కోనసీమ : రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట (కొత్త) 9. తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం, కొవ్వూరు 10. పశ్చిమగోదావరి : నర్సాపురం, భీమవరం (కొత్త) 11. ఏలూరు : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు 12. కృష్ణా : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త) 13. ఎన్టీఆర్‌ : విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త) 14. గుంటూరు : గుంటూరు, తెనాలి 15. బాపట్ల : బాపట్ల (కొత్త), చీరాల (కొత్త) 16. పల్నాడు : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్...

మల్లెం కొండ కడపకద్దిన కాశ్మీరం

మల్లెం కొండ కడపకద్దిన కాశ్మీరం      కొండ గాలుల, సంగీత సవ్వడులను తలపిస్తూ గల గల దూకే జలపాతాలు, పక్షుల కిల కిలా రావాలు, ప్రకృతి సంగీతాన్ని ఆలపించే నిశ్శబ్ధ స్వరాలు, స్వచ్ఛమైన వినీలాకాశపు నిర్మలత్వం మనసును మైమరిపించే మల్లెం కొండ అందాలు,అనుభూతులు కాశ్మీర్ సోయగాలకు ఏ మాత్రం తీసిపోవు అనిపిస్తుంది.కురిసిన వర్షాలకు అడవంతా పచ్చని చీరకట్టుకున్నట్లుంది. దారి పొడవునా అక్కడక్కడా మట్టి కొట్టుకుపోయి ఎగుడుదిగుళ్లు, వాగులు, వంకల్లో రాళ్లు ఇంటిలో రాయిలా తగిలినా ఆ అందాల వీక్షణ అవన్నీ మరచేటట్లు చేస్తుంది.      మల్లెం కొండ కడప ( వైఎస్సార్) జిల్లా లోని బద్వేలుకు 5కి.మీ.దూరంల ఉన్న గోపవరం మండలంలో ఉంది. ఈ కొండ గురించి మెఖంజీ కైఫియత్తు ఉంది. కైఫియత్తు అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కోసం గ్రామాధికారి రాసిన ఒక రికార్డు.      మెఖంజీ కైఫియత్తు ప్రకారం పెదవీరమల్లుడు చినవీరమల్లుడు అనే సోదర రాజులు మల్లెం కొండ ప్రాంతంలో వేటకు వచ్చారు. వీరు ఏ ప్రాంతపు రాజులో తెలుపలేదు. పెదవీరమల్లుడు నిండు చూలాలుగా వున్న అడవి పందిని వేటాడాడు. అది పరిగెత్తి ఆ కొండ మీద నుండి కోనలో ...

రాయలసీమ లో సామాజిక పరిస్థితులు

ఇనుప యుగం నుండి విజయనగర రాజుల కాలం వరకు రాయలసీమ లో సామాజిక పరిస్థితులు  ( క్రీ.పూ.400 నుండి క్రీ.శ.1565 వరకు)            రాయలసీమ పేరుతో ఒక భౌగోళిక స్వరూపం సంతరించడం 1928 నాటికి జరిగింది.ఇనుప యుగంలో కొన్ని గ్రామ సముదాయాలతో ఉండింది ఈ ప్రాంతమంతా.జనపదాల నుంచి రాచరిక వ్యవస్థ లోకి వచ్చిన తర్వాత ఆ నాటి రాజుల శాసనాల ఆధారంగా మనకు కొన్ని సామాజిక పరిస్థితులు తెలుస్తున్నాయి. అయితే రాయలసీమ ప్రాంత సామాజిక పరిస్థితులు విజయనగర రాజుల కాలం నుండి వివిధ రచనల ద్వారా తెలుస్తున్నాయి. అందువల్ల రాయలసీమ ప్రాంతాన్ని ఆనాటి మొత్తం తెలుగు సమాజపు సామాజిక పరిస్థితులలో భాగంగానే పరిశీలించాల్సి వుంటుంది.            క్రీ.పూ.4వ శతాబ్దం నాటికే ఆంధ్రులకు 30 నగరాల సామాజిక , రాజకీయ వ్యవస్థలుండేవని మెగస్తనీస్, తరువాత ఏరియన్ అనే గ్రీకు రచయితలు రాశారు .              కోటిలింగాల , పెద్ద బంకూరు , ధూళి కట్ట , ఎమునూరు మొదలైన స్థలాల తవ్వకాలలో లభించిన క్రీ.పూ.5 - 3 శతాబ్దాల నాటి పంచ్ మార్క్ డ్ నాణేలు , కుండ పెంకులు , ఇనుప వస్తువులు ఆన...

కదిరి ఆవిర్భావం

కదిరి ఆవిర్భావం          కడప గెజిటీర్లో పేర్కొన్న ప్రకారం 1807 నాటికి కదిరి పులివెందులతో కలిపి పులివెందుల తాలూకాగా కడప జిల్లా కింద ఉండేది . అందువల్ల కడప జిల్లా నుంచి కదిరిని వేరుపరిచే వరకు కడప జిల్లాను పాలించిన వారే కదిరిని కూడా పాలించారు. 2వ శతాబ్దంలో పల్లవులు పరిపాలించారు వారి పరిపాలన మూడు నాలుగు శతాబ్దం వరకు ఉందని సిద్దవటం తాలూకా గంగ పేరూరులో లభించిన రోమకు నాణేలవల్ల తెలుస్తోంది తర్వాత ఇక్ష్వాకులు చాళుక్యులు పరిపాలించారు. కడప జిల్లాను హిరణ్య రాష్ట్రమని పిలిచేవారు ఈ జిల్లాను చాళుక్యులు పరిపాలించారు. మూడవ శతాబ్దంలో వీరు కడప ప్రాంతాన్ని పరిపాలించారు అందులో భాగంగా కదిరి వారి ఆధీనంలో ఉంది. చాళిక్కులు అనంతరం ఈ ప్రాంతాన్ని సాధారణ శకం 8వ శతాబ్దం వరకు తెలుగు చోళులు పాలించారు. ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని రేనాడుగా వ్యవహరించే వారని చైనా యాత్రికుడు హ్యూయాన్ సాంగ్ రాతలను బట్టి తెలుస్తోంది. పదవ ఎనిమిదవ శతాబ్దంలో చివరి భాగంలో రాష్ట్రకూటులు దండయాత్ర చేశారు. వీరే రాట్టులుగా, తర్వాత కాలంలో రెడ్లుగా మారారని చరిత్ర చెబుతోంది. తొమ్మిదో శతాబ్దంలో బాలరాజులు పరిపాలించారు పదవ శతాబ్దంలో చ...

కరువుసీమ కదిరి శ్రామికుల వలస భారతం

కరువుసీమ కదిరి శ్రామికుల వలస భారతం        రాయలసీమ ప్రాంతం దక్కన్ పీఠభూమిలో ఉంది. శతాబ్దాలుగా ఇది కరువు ప్రాంతం అయిపోయింది. ఈ ప్రాంతంలో ఎక్కువ భాగం మెట్టభూములే. కొన్నిచోట్ల పాక్షిక నీటిపారుదల సౌకర్యం ఉంది. అనంతపురం, కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇది 67.29 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇక్కడ కోటి 30 లక్షల జనాభా వుంది. సాగుభూమి 24.16 లక్షల హెక్టార్లు. ఇందులో 5.57 లక్షల హెక్టార్లలో (23 శాతం) భూగర్భ జలాలతో, కొంత భాగం నదుల నీటితో వ్యవసాయం కొనసాగుతున్నది. ఈ ప్రాంతంలో 14.9 లక్షల హెక్టార్లలో(22 శాతం) అడవులు ఉన్నాయి, వీటిలో ఎక్కువ భాగంలో చెట్లు కూడా ఉండవు. ఇక్కడ భూగర్భ జలాలతో, నదుల నీటితో సాగే వ్యవసాయంపై ఆధారపడటం కూడా కష్టమే. ఇక్కడ పరిశ్రమలు తక్కువ, వర్షాధార వ్యవసాయంపై ఇక్కడ జీవనంకొనసాగిస్తుంటారు. అందువల్ల తరచుగా కరువులు కూడా తప్పడం లేదు. వార్షిక సగటు వర్షపాతం అంటే నైరుతి, ఈశాన్య రుతుపవనాలతో కలిపి 350 నుంచి 650 మిల్లీమీటర్ల వరకు ఉంది (ప్రసాద్ పురేంద్ర, 1998),            1996 నుంచి ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా ఇక్కడ కరువుల...

హంద్రీ-నీవా సుజల స్రవంతి

హంద్రీ-నీవా సుజల స్రవంతి(హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) ప్రాజెక్టు          రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు సాగు మరియు తాగునీరు అందించడంలోఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తోంది. ప్రాజెక్టు ద్వారా 6.025 లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాలు మరియు సుమారు 33 లక్షల మందికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో రూపొందించబడింది. ఇందులో 565 కి.మీ. ప్రధాన కాలువ, 8 రిజర్వాయర్లు, 4 బ్రాంచ్ కెనాల్స్, 3 డిస్ట్రిబ్యూటరీలు మరియు 43 పంప్ హౌజులు ఉన్నాయి. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.6850.00 కోట్లు. ప్రాజెక్టు పనులు రెండు దశల్లో జరుగుతున్నాయి: దశ-I: మల్యాల పంప్ హౌస్ నుండి నీటిని ఎత్తిపోసి, ప్రధాన కాలువ ద్వారా రాయలసీమ జిల్లాలకు పంపించడం. దశ-II: ప్రధాన కాలువను 216.300 కి.మీ నుండి 565 కి.మీ వరకు విస్తరించడం. ప్రస్తుతం, హంద్రీ-నీవా కాలువ విస్తరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో కాలువ విస్తరణ పనులు చకచకా సాగుతున్నాయి, దీంతో 2014 నుండి హంద్రీ-నీవా జలాల కోసం ఎదురు చూస్తున్న కుప్పం ప్రజల నిరీక్షణకు తెరపడే రోజు దగ్గరలోనే ఉన్నట్టు కన్పిస్తోంది.  అయితే, కాల...

కదిరి ప్రాంతంలో ఉపాధి

కృష్ణదేవరాయల పాలన తర్వాత రాయలసీమ పాళెగాళ్ల రాజ్యమయింది.కదిరి కూడా కొక్కంటి పాళెగాడు కొండమ నాయుడు మొదలైన పాళెగాళ్ల పాలనలో ఉండింది. వీరెవరూ సామాన్య ప్రజల్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత, పాళెగాళ్లను బ్రిటిష్ వాళ్లు అణచివేశాక, కొంతమేరకైనా రాయలసీమ మేము సుస్థిరపాలనలోకి వచ్చింది. భూములు సర్వే చేయబడ్డాయి. కె.సి కెనాల్ బ్రిట్రస్ వాళ్ల ప్రయోజనార్థమైనా, తర్వాతి కాలంలో కర్నూల్-కడప జిల్లా రైతాంగాన్ని కొంతమేరకు సుభిక్షం చేసింది. వరుస కరువులతో సతమతమైన రాయలసీమ ప్రజల భూముల దాహార్థి తీర్చేందుకు రాయల కాలంలో నిర్మించిన చెరువులు, కుంటలు పాళెగాళ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురై పూర్తిగా ధ్వంసం అయ్యాయి. మన్రోలాంటి బ్రిటీష్ గవర్నర్లు వాటిని పునర్నిర్మాణం చేసి, ప్రజల, భూముల దాహార్తిని తీర్చారు.     అనంతపురంలో ఐదు జిల్లాలకు ఏకైక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కర్నూల్లో మిషనరీ హైస్కూల్లు ప్రారంభించబడ్డాయి. (ఆ తర్వాత స్వతంత్ర భారతంలో 1968 వరకు అనంతపురం జిల్లాకు మరొక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కూడా రాలేదు. మన్రో పాలనా కాలాన్ని (1800-1807) ఇప్పటికీ 'స్వర్ణయుగంగా' అనంత(కదిరి)వాసులు భావిస్తున్నారంటే, ప్రజల ప్రయోజనాల ప...

రాయలసీమ లో నూతన శిలాయుగం

పులివెందుల తాలూకా వేములలో, కడప సమీపంలోని వెల్లటూరులో, కదిరి తాలూకా ముండ్లవారిపల్లె దొరిగల్లులో అనేక తరహాల పనులకుపయోగపడే నూతన శిలాయుగపు పనిముట్లు దొరికినాయి. వెల్లటూరులో దొరికిన చిన్న తోటలో సున్నం లాంటి పదార్థం కనిపించింది. దానిని బట్టి ఆనాడు తాటి కల్లు పరిశ్రమ వుండేదని వూహిస్తున్నారు. ముండ్ల వారి పల్లెలో శంకు చిప్పల కంకణాల పరిశ్రమ గుర్తులు కనిపించినాయి. http://dsal.uchicago.edu/reference/gaz_atlas_1909/fullscreen.html?object=33%22 కర్నూలులో నూతన శిలాయుగపు పరికరాలు దండిగా దొరికినాయి. పత్తిపాడు వద్ద జాడీలు, చుట్టగుదురులు, లోటాలు, మాదిరి చిన్న పాత్రలు, కుదురు బిళ్ల, చిన్న గుర్రపుబొమ్మ, ఇంకా అనేకానేక ఆసక్తికరమయిన వస్తువులు దొరికినాయి. భారతదేశంలో మరెక్కడా దొరకని కొమ్ముకుండ ఒకటి ఇచ్చట దొరికింది. బహుశ పాలు, పెరుగులకు దీనిని ఉపయోగించి వుంటారని అనుకుంటున్నారు. ఇది ప్రస్తుతం మద్రాసు మ్యూజియంలో వుంది. పత్తికొండ తాలూకా కప్పతల్లి మిట్టమీద, వస్తువులు మెరుగు పెట్టేందుకు వుపయోగించిన గాడి పల్లాలు దొరికాయి. ఆనాడు సున్నపురాతితో బండి చక్రాలు తయారు చేసేవారని తెలుస్తున్నది. నూతన శిలాయుగపు ప్రారంభదశలో జనం ...

అనంత' కదిరి యోధుడు రాజన్న

మహత్తర నావికా దళ తిరుగుబాటులో 'అనంత' కదిరి యోధుడు రాజన్న              రెండవ ప్రపంచయుద్ధం తరువాత 1945-46లలో భారతదేశంలో బ్రిటీషు సామ్రాజ్యవాదుల పునాదులను కదిలించే కొన్ని సంఘటనలు జరిగినాయి. అందులో శిఖరాయమానమైనది నావికా దళ తిరుగుబాటు. 1945 జనవరిలో ప్రజా ఉద్యమానికి తలవొగ్గి ఇండియన్ నేషనల్ ఆర్మీ ఖైదీలను విడుదల చేయక తప్పని పరిస్థితి బ్రిటీష్ వారికి కలిగింది. ఇది వారికి పెద్ద దెబ్బ. 1946 ఫిబ్రవరిలో నానిక దళ తిరుగుబాటు జరిగింది. నావికదళ తిరుగుబాటు తరువాత తమ అధికారానికి రోజులు దగ్గర పడ్డాయని బ్రిటీషు ప్రభుత్వం గుర్తించింది. నావికా దళ తిరుగుబాటు భారత దేశంలో ఆ తరువాత జరిగిన అనేక సమ్మెలకు, పోరాటాలకు ఉత్ప్రేరకంగా పనిచేసింది.             కదిరి మండలంలోని కాళ సముద్రం గ్రామంలో 12-5-1920న రాజన్న జన్మించాడు. తండ్రి జి. దేవదానం. తల్లి జి. సుందరమ్మ. యస్.యస్.యల్.సి. చదివిన తరువాత 11-9- 1943లో రాయల్ ఇండియన్ నేవీలో చేరినాడు. వార్సా, మచిలీ మార్ అనేచోట్ల శైలర్ శిక్షణ పొందినాడు. శిక్షణ తరువాత ఈయన్ను ఆర్.ఐ.యన్.కు చెందిన హియావతి అనే ఓడలో నియమించారు. అద...

చెెెెెెెెెెర్లోపల్లి బురుజు

చెెెెెెెెెెర్లోపల్లి   బురుజు      ఎన్నో కోట్ల ఖర్చుతో నిర్మించే కట్టడాలు ఐదు పదేళ్లలోనే పగుళ్లుబారతాయి. అలాంటిది సుమారు రెండు వందల ఏళ్ల కిందటి ఆ నిర్మాణం నేటికీ చెక్కుచెదరకుండా చూపరులను ఔరా అనిపిస్తోంది. కదిరి మండలం చెర్లోపల్లి గ్రామంలో 1800 ప్రాంతంలో పూర్తిగా రాళ్లతో సుమారు 60 అడుగుల ఎత్తు బురుజును నిర్మించారు. నాడు ధాన్యం, ఇతర సామగ్రి అపహరించుకెళ్ళేందుకు రాత్రివేళల్లో బందిపోట్లు వచ్చిపడేవారట. అయితే చెర్లో పల్లి పరిసర ప్రాంతాల్లో పెద్ద చెరువు కింద రైతులు పంటలు బాగా పండించేవారు. బందిపోట్ల బారినుంచి కాపాడుకునేందుకు ఇలా బురుజు నిర్మించుకుని అందులో ధాన్యం, ఇతర సామగ్రి దాచేందుకు అరలు ఏర్పాటు చేసుకుని వాటిని గ్రామస్థులే కాపలా కాసేవారంటారు. _____న్యూస్ టుడే, కదిరి 

కరువు

అనంతపురం జిల్లా రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా. దీని వైశాల్యం 19135 చ.కి.మీ.గోదావరి రెండు జిల్లాలంత ఉంటుంది. ఇందులో సాగు భూమి 27 లక్షల ఎకరాలు. దీనిలో ఒక లక్షా 76 వేల ఎకరాలు నీటి పారుదల పథకాల కింద ఉంటే, 55 వేల ఎకరాలు  చెరువులు కుంటల కింద సాగువుతోంది.దాదాపు 88 శాతం వర్షాధారం మీద ఆధారపడి ఉంది. జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువ.గాలులు ఎక్కువ.జీవనదులు లేవు. జిల్లాలో వర్షపాతం తక్కువ. కేవలం 550మి.మీ. మాత్రమే. జిల్లాలో సగటు ఆవిరి నష్టం 1850 మిల్లీమీటర్లు. భూమి మీద పడిన నీరు ఆవిరై పోతుంది. జిల్లాలో ఏ మండలంలో కూడా సహజమైన నీటివనరులు లేవు.మొత్తం గ్రామాలన్నీ తాగునీటి కోసం బయటి నుంచి వచ్చే నీటి మీద ఆధారపడా ల్సిందే.జిల్లాలోని రిజర్వాయర్ల సామర్థ్యం 24 టీఎంసీలు మాత్రమే. చెరువులు కుంటలది 16టిఎంసిలు.   అంటే 25 లక్షల ఎకరాల్లో వర్షాధారం మీద ఆధారపడే రైతులు పంటలు సాగుచేస్తున్నారు. ఈ సాగుభూమికి ఆరుతడి కింద ఒక పంటకు నీళ్లు ఇవ్వాలంటే 250 టిఎంసిల నీళ్లు కావాలి. తాగునీటి కోసం కనీసం 30 టీఎంసీల నీరు కావాలి .ఇది ఈ జిల్లా అవసరం.                అనంతపురం జిల్లాలోని పెన...

పెన్నా నది పై నిర్మించిన ప్రాజెక్టులు

           పెన్నా నది  పై నిర్మించిన ప్రాజెక్టులు. "ఇదే పెన్న ఇదే పెన్న నిదానించి నడు వట్టి ఎడారి తమ్ముడు" అంటూ విద్వాన్ విషయం వర్ణించిన ఒకే ఒక అజీవనది పెన్నా . ఇది ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న ఏకైక నది. పెన్నా నది కర్ణాటకలోని చిక్కబళ్లాపురం జిల్లాలోని నందికొండలలో (Nandi Hills) వద్ద 1,500 మీటర్ల ఎత్తున పుట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు వద్ద బంగాళా ఖాతంలో కలుస్తుంది. పెన్నా నది మొత్తం పొడవు 597 కి.మీ. ఇది అక్కడ నుండి  69 కి.మీ. ప్రవహించి  అనంతపురం జిల్లా పరిగి మండలంలో ప్రవేశిస్తుంది. అక్కడినుంచి  37 మండలాలో 267 కి.మీ. ప్రవహిస్తూ తాడిపత్రి మండలం నుంచి నిష్క్రమించి కడప జిల్లా గండికోటకు చేరుకుంటుంది. జిల్లాలో నది ప్రవేశించే చోట సముద్ర మట్టానికి 635 మీటర్లు ఉంటే, గండికోటకు చేరేటప్పటికి 220 మీటర్లకు తగ్గిపోతుంది. పెన్నా నది వాలు ఎక్కువగా ఉంటుంది. సగటున ప్రతి కి.మీ. కు 50 అడుగుల మేర ఎత్తు తగ్గుతూ ఉంటుంది. అందుకే Mysuru plateau లో నదుల వాలు ఎక్కువగా ఉంటుందని ప్రఖ్యాత ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు తన ఆత్మకథలో రాసుకున్న...

హంద్రీనీవా

ప్రధాన నీటి వనరు హంద్రీనీవా  డాక్టర్ శివరామకృష్ణయ్య గారు అనంతపురం జిల్లాలో సూపరిండెంట్ ఇంజనీరుగా ఉన్నప్పుడు జిల్లా కోసం అనేక నీటి పథకాలు సూచించారు. అంతవరకు అనంతపురం జిల్లా వాసులకు నీళ్లు లేవు అని సమాధానం వచ్చేది. ఇప్పుడున్న పీఏబీఆర్ రిజర్వాయర్ కూడా ఆయన రూపొందించిందే. ఆయన హంద్రీ నీవా రెండు నదులను కలుపుతూ ఎత్తిపోతల ద్వారా కృష్ణా జలాలను అనంతపురం జిల్లాకు మళ్లించి సాగునీరు తాగునీరు అందించవచ్చునని సూచించారు. 1988లో స్వర్గీయ రామారావు గారు 40 టీఎంసీలకు పథకం ఆమోదించారు. తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాకు తాగునీటికి మాత్రమే అని 10 టీఎంసీలకు ఉరవకొండలో ఒకసారి, 1999లో 5 టిఎంసిల సామార్థానికి ఆత్మకూరులో రెండవసారి శిలాఫలకాలు వేయడం జరిగింది. డాక్టర్ శివరామకృష్ణయ్య సేవా సమితి తరపున ఈ పథకాన్ని 60 టీఎంసీలకు ప్రారంభించాలని జిల్లావ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహించింది. అయితే డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడున్న పథకం మేరకు 40 టీఎంసీల సామర్థ్యానికి ఆమోదించారు. పనులు కూడా ప్రారంభించడం జరిగింది. 2005ను పనులు మొదలు పెట్టినా మొదటి దశలో అనంతపురం జిల్లాకు వాగ్దానం చేసినట్లుగా 1,18...
రాయలసీమ చరిత్ర రచనకు ఉపకరించిన ఆధారాలను ప్రధానంగా రెండు తరగతులుగా విభజించవచ్చు. అవి: 1) పురావస్తు ఆధారాలు 2) వాఙ్మయాధారాలు, 1) పురావస్తు ఆధారాలు : పురావస్తు ఆధారాలను తిరిగి మూడు విధాలుగా విభజించవచ్చు. అవి: 1) శాసనాలు 2) నాణేలు 3) కట్టడాలు (లేక) ఇతర అవశేషాలు. 1) శాసనాలు : భారతదేశ చరిత్రలో మొట్టమొదటి శాసనాలు అశోకుని శాసనాలే. అశోకుని శాసనాలు క్రీ.పూ. 250 ప్రాంతం నాటివి. ఇవి ప్రధానంగా శిలలపైనా, శిలాస్తంభాల పైనా వ్రాయబడినవి. రాయలసీమ లోని ఎర్రగుడి, రాజుల మందగిరి,  కొట్టాంలలో లభించిన అశోకుని ధర్మశాసనాలు ఆంధ్రదేశం మౌర్య సామ్రాజ్యంలో భాగమైందని నిరూపిస్తున్నాయి. అశోకుని శాసనాల తర్వాత పేర్కొనదగినవి క్రీస్తు పూర్వం 2 నుంచి 11వ శతాబ్ధాల మధ్య బహుదా నదీ తీరాన ఆడపూరు వద్ద ఉన్న కొండపై బౌద్ధమత ఆరామాలు ఉన్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి.  ఇవి క్రీ.పూ. 200 నాటికే బౌద్ధమతం రాయలసీమ లో వ్యాపించిన విషయాన్ని తెలుపుతున్నాయి. తూర్పు చాళుక్య యుగం నుండి శాసనాలలో తెలుగు భాష వాడకం ప్రారంభమైంది. బ్రాహ్మీలిపి తెలుగు లిపిగా పరిణామం చెందింది. అయిననూ సంస్కృత భాషా, దేవనాగరి లిపి శాసనాలలో విధిగా ఉపయోగింపబడేవి. అశోకున...