పోస్ట్‌లు

జూన్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

కదిరిలో పర్యాటక రంగం

కదిరిలో పర్యాటక రంగం                   కదిరి ప్రాంతంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి .ఇందులో తిమ్మమ్మ మర్రిమాను , వేమన మెమోరియల్ కేంద్రము, చంద్రవదన మొహియార్ సమాధి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ప్రముఖంగా ఉన్నాయి .ఇవి కాకుండా కదిరి కి దగ్గరలో హార్స్లీ హిల్స్, పుట్టపర్తి ,లేపాక్షి ఉన్నాయి.ఇవే కాకుండా పాలపాటిదిన్నె ఆంజనేయ స్వామి దేవాలయం, పాల బావి ,కదిరి కొండ, బ్రాహ్మణపల్లి జలాశయము ,వెలిగల్లు జలాశయము ,వేమన జలాశయము , వెంగ ముని ఆలయం ఇలా మొదలైన ప్రాంతాలు అటు పర్యాటక రంగానికి ఇటు యాత్రా స్థలాలుగా ఉపయోగపడుతున్నాయి. వీటన్నిటిని సరైన రీతిలో అభివృద్ధి చేస్తే కదిరి ప్రాంతంలో పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతుంది .దీనివల్ల  అనేక వాహనాలకు గిరాకీ ఉంటుంది. వసతి గృహాలకు మంచి డిమాండ్ ఉంటుంది. దీని వల్ల చాలా మందికి ఉపాధి పెరుగుతుంది. పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు 1. బ్రాహ్మణపల్లి జలాశయం దగ్గర ఒక బృందావనం ను ఏర్పాటు చేయాలి. 2. శ్రీలక్ష్మీ నరసింహ దేవాలయానికి ప్రత్యేక భోజనశాలను నిర్మించాలి. ...

కదిరిలక్ష్మీనరసింహస్వామి ఆలయం

చిత్రం
  కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ______________పిళ్లా విజయ్               (9490122229)             క్రీ.శ. 1274 లో   విజయనగర సామ్రాజ్యాన్ని పాలిస్తున్న వీరబుక్కరాయలు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఖాద్రి వృక్షాల నీడలో విశ్రమించాడు . అప్పుడు ఒక చెట్టు కింద కొన్ని శిలలు కనిపించడం తో అక్కడ  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని కట్టించాడు. ఆ తర్వాత క్రమక్రమంగా అది అభివృద్ధి చెందడం మొదలైంది. క్రీస్తుశకం 1391లో నరసింహ లక్ష్మన్న అనే దాసరులు ఇద్దరు లక్ష్మీ నరసింహ స్వామి భక్తులు. వారు ఆ గుడి చుట్టూ ఎత్తైన రాతి స్తంభాలను ఏర్పాటుచేసి, ఆ గుడిలో దీపాలను వెలిగించడం మొదలుపెట్టారు. గర్భగుడిలో నరసింహస్వామి, ఆయన భక్తుడు ప్రహ్లాదుడు కూడా ఉంటాడు. అందువల్లనే తెలుగు రాష్ట్రాలలో ఉన్న 9 నరసింహస్వామి ఆలయాలలో కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం విశిష్టమైనదిగా పేరొందింది. గర్భగుడిలోనే లక్ష్మీదేవి గుడి  కూడా ఉంది.గుడి బయట వున్న జయ విజయుల విగ్రహాల శిల్ప రమణీయత చెప్పనలవి కాదు. ఈ ఆలయం దాదాపు 10 ఎకరాలలో విస్తరించి ఉంది. ...

రాయలసీమ స్త్రీ రచయితల కథా ప్రస్థానం

చిత్రం
                     రాయలసీమ వెయ్యేళ్ళ సాహిత్య చరిత్రలో కథాసాహిత్య చరిత్ర 1918 లో ప్రారంభమైతే, రాయలసీమ స్త్రీ రచయితల కథా ప్రస్థానం 1927 నుండి మొదలైంది.నిజానికి 1926 లో కస్తూరి వెంకట సుబ్బమ్మ (అనంతపురం) 'కథామంజరి ' పేరుతో పౌరాణిక వస్తువుతో ' బలిచక్రవర్తి చరిత్రం ', ' భీష్మోదయం ', ' గరుడ చరిత్రం ' కథలు రాశారు. కానీ ఇవి ఆధునిక జీవితాన్ని చిత్రించిన కథలు కాకపోవడం వలన కథానిక ప్రక్రియగా అంగీకరించవలసిన పని లేదు. 1927 సంవత్సరంలో చిత్తూరు జిల్లా నుండి మామిడి రుక్మిణమ్మ, కడపజిల్లా ప్రొద్దుటూరు నుండి కథలు రాసిన పూండి చెల్లమ్మ, డి. పాపమ్మ ఆనాటి సమకాలీన సామాజిక సమస్యలను వస్తువుగా స్వీకరించి ' సీతాబాయి, సుందరి, అత్తగారు రేడియో తెలుసుకొంటిరా ' అనే కథలను ' భారత కథానిధి ', ' సాధన ',' భారత జ్యోతి ' పత్రికలలో ప్రచురించారు. ఆధునిక జీవితాన్ని ప్రతిబింబించేట్లుగా వరకట్న సమస్యను, ప్రేమ వివాహాలను తమ కథల్లో చిత్రించారు. కొంతమంది రాయలసీమ తొలి స్త్రీ రచయితలు ఆధ్మాత్మిక జీవిత నేపథ్యంలోంచి భక్తి ప్రధానమైన ఇతివృత్తాలనే కథావస్తువుగా చేసుకున్నారు. పురాణ ...

అనంతపురంకు ఆ పేరెలా వచ్చింది?

         రాయలసీమలో ప్రతి పల్లెకు, చెరువుకు, నదికి, కొండకు, కోనకు, గుహకు, బండకు, కోటకు, గ్రామ దేవతకు,శిష్టదేవతకు, ఒక్కొక్క పేరు వుంటుంది. ఆ పేరెలా వచ్చిందని   ఆ ప్రాంత వాసుల్ని కదిపితే  ఆసక్తి కరమైన ఒక కథ చెబుతారు.సాధారణంగా వ్యక్తుల పేర్లను బట్టి, ఇంటి పేర్లను బట్టి, కులం పేర్లను బట్టి, మిట్ట పల్లాలను బట్టి, పరిమాణాన్నిబట్టి ఊర్ల  పేర్లు ఏర్పడ్డాయి. ఈ అనంతపురం నగరాన్ని కర్ణాటకకు చెందిన నడియార్ వంశానికి చెందిన అనంతరసు అనే రాజు పాలించాడు.ఆయన పేరు మీద అనంతపురం అనే పేరు వచ్చింది.  ___ పిళ్లా విజయ్

బుక్కరాయసముద్రం పేరెలా వచ్చింది?

          విజయనగర సామ్రాజ్య సంస్థాపకులైన హరిహర రాయలు,బుక్కరాయలలో బుక్కరాయలు అనంత పురానికి దగ్గరలో ఒక చెరువు త్రవ్వించినారు.ఆయన పేరు మీద  బుక్కరాయ సముద్రం అనే వూరు ఏర్పడింది.ఇప్పుడది అనంతపురం జిల్లాలో ఒక మండలం.

పుంగనూరు పేరెలా వచ్చింది?

                రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో లో పుంగనూరు అనే ఊరు ఉంది. పుంగనూరు అసలు పేరు పుంగ పురి. ఈ ఊరు పూర్వం పరుశురామ క్షేత్రం గా పేరుగాంచింది. చోళుల కాలంలో దీనిని పులనాడు అనేవారు.             పుంగన్ లేదా పుంగవన్ అంటే తమిళంలో మునిశ్రేష్టుడని అర్థం. ముని పుంగవుడైన వాల్మీకి ఈ ప్రాంతంలో నివాసం ఏర్పరుచుకున్నారని ప్రతీతి. అందుకే ఆయన పేరుతో పుంగన్ +ఊరు = పుంగనూరు అయిందని చెపుతారు. పుంగనూరు ప్రాంతంలో పుంగ(కానుగ) వృక్షాలు ఎక్కువగా వుండడం వల్ల 'పుంగనూరు' అనే పేరు వచ్చివుండవచ్చని మరి కొందరి వాదం. పుంగం అంటే ఎద్దు. ముందునుంచి పుంగనూరు ఒక ప్రత్యేకమైన జాతి ఆవులకు ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఈ ఊరికి పుంగనూరు అనే పేరు వచ్చిందంటారు.                ఇంకా కొంతమంది. 'వలవనారాయణ చతుర్వేది మంగళం' అనే పేరుగల ఊరిని పుంగమ్మ అనే రాణి ఏలినందు వల్ల ఆమె పేరుతో పుంగమ్మ ఊరు పుంగనూరుగా మారిందని చెపుతారు. పుంగమ్మ పేరు మీద ఈ ప్రాంతంలో అత్యంత ప్రచారంలో వున్న కోలాట పదం చూడవచ్చు.         ...

చారిత్రక గేయాలు

                          మానవసేవే మాధవసేవగా భావించి కరువు కాటకాలు సంభవించినపుడు సాటివారికి తన సర్వస్వాన్ని ధారపోసిన దానకర్ణుల పైన జానపదులు భక్తి ప్రపత్తులతో పాటలు పాడుకుంటారు. రాయలసీమలో వెంగళరెడ్డి, సుద్దపల్లి లక్షుమ్మ, సుద్దపల్లి రామచంద్రారెడ్డి, యాదళ్ళ నాగమ్మ, చిన్న అండూరి మొదలైన వారు దానకర్ణులుగా ప్రసిద్ధి పొందారు. వీరి దాతృత్వాన్ని ప్రశంసించే కథాగానాలున్నాయి. ఈ కథా గానాల్లో బుద్దా వెంగళరెడ్డి గేయం ప్రశస్తమైనది. ఈ కథాగానానికున్న వ్యాప్తి సీమలో మరి ఏ ఇతర గానానికి లేదు. రాయలసీమ జిల్లాలలో ముఖ్యంగా రైళ్ళలో, బస్సుల్లో తిరునాళ్ళలో ఎక్కడపడితే అక్కడ ఈ కథాగానం వినిపిస్తుంది. ముఖ్యంగా భిక్షుక వృత్తితో జీవనం సాగించేవారు. ఈ పాటలను ఆలపిస్తుంటారు. బుడ్డా వెంగళరెడ్డి                      బుడ్డా వెంగళరెడ్డి క్రీ.శ. 1822లో కర్నూలు జిల్లాలో జన్మించిన రేనాటి దానకర్ణుడు. ఇతని దానగుణాన్ని మెచ్చుకొని విక్టోరియా మహారాణి 1866లో బంగారు పతకాన్ని బహూక రించింది. ఈ పతకం ఇప్పటికి ఉయ్యాలవాడ లోని...

రాయలసీమ జానపదుల సంస్కృతి

               వివిధ కథా గానాలా ధారంగా రాయలసీమ జాన పదుల సంస్కృతి సంప్ర దాయాలు,ఆచార వ్యవ హారాలు,కళలు, అలంకరణలు, వినోదాలు,నమ్మకాలు మొదలై నవి తెలుస్తాయి.              గ్రామదేవతలకు ప్రతి శివరాత్రికి తిరునాళ్ళు జరుపుతారు.తిరునాళ్ళు ఎంతో వైభోగంగా జరుగు తాయి.సుదూర ప్రాంతాల నుంచి కూడ ఈ తిరునాలకు వెళ్తారు. కడపలో దేవునికడపలో, నిత్యపూజ య్య స్వామి దగ్గర తిరునాల జరుగుతూంటుంది.             "చిన్నపరెడ్డి కథ"లో తిరునాళ్ళకు వచ్చేటప్పుడు ఎద్దులకు చేసిన ఆలంకరణను చూడడానికి జనాలు ఎగబడి నట్లు వారిని నివారించడంలో యజమానులు ఎంతో కష్ట పడినట్లు ఉంది. " రామలక్ష్మణ ఎద్దులా ఆ ప్రభకేమో కట్టుకున్నారు. రాజా! ఎక్కడెక్కడ వున్నా మంది ఆంతమందిని తొలగదీసిరి || కోటప్పస్వామి కొండకు ప్రదక్షిణ చేశాడు రెడ్డి ||రాజూ|| "తిమ్మమ్మ" కథాగానంలో, తిమ్మమ్మ తిరునాళ్ళు గురించి ఉంది. "వేద బ్రామ్మలు వేదాలు చదవంగ హరికథలు, బుర్రకథలు చెప్పుతుంటారు. జాతకంబులు వాళ్ళు చక్కగా చదవంగ సకల సంతోషంబుగా పరస జరుగుతుంది"          ...

రాయలసీమ కథాగానం

రాయలసీమ కథాగానం                  __ సి.రమాదేవి               (సేకరణ: పిళ్లా విజయ్)                 9490122229 రాయలసీమ జానపద విజ్ఞానానికి గని లాంటిది సీమ జానపద సాహిత్యం. కళలు ప్రజల సాంఘిక,చారిత్రక జీవన విధానంలోంచి పుట్టుకొస్తాయు. ఇవి వారి సాంస్కృతిక వారసత్వాన్ని చాటుతాయి.         జానపదుల మౌఖిక ప్రచారం ద్వారా కథాగానాలు ఒక తరం నుంచి ఇంకొక తరానికి అందించబడు తున్నాయి. సామాన్యంగా ఈ కథాగానాలు ఒక రాత్రిలోనే పూర్తి అయ్యే నిడివి కలిగి ఉంటాయి. వీటిని 'ఒక సామ్యం' లేక 'ఒక జాము కథ'లు అని అంటారు.కొన్ని కథాగానాలు ఎక్కువ నిడివి గలిగి రెండు నుంచి ఏడు రాత్రుల వరకు చెప్పేవి కూడ వున్నాయి.             ఇతివృత్తాన్ని బట్టి కథాగానాలను చారిత్రక, సాంఘిక, దైవసంబంధ కథాగానాలుగా విభజించవచ్చు. వీటి ఆధారంగా చారిత్రక, సాంఘిక,సాంస్కృతిక ఆధ్యాత్మికాంశాలను అధ్యయనం చేయవచ్చు.             రాయలసీమలోని  కథాగానాలు సంగీత సాహిత్య...

శశిశ్రీ

శశిశ్రీ  ‌      __ ఖలందర్                 దాదాపు అరవై వసంతాలు నింపుకొని, అస్తమించిన శశిశ్రీ, సాహిత్యా కాశంలోని శశియే! ఈయన అసలు పేరు షేక్ బేపారి రహమతుల్లా.కడప జిల్లా సిద్ధవటం జన్మస్థలం. కార్యక్షేత్రం కడప నగరం.              ఆధునిక కవిగా, జీవితాన్ని దృశ్యీకరించే కథారచయితగా, సీనియర్ జర్నలిస్టుగా మంచి పేరు పొందిన శశిశ్రీ వక్త గా కూడా ప్రసిద్ధుడు.ఈయన గురువు సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు.ఆయనే ఈయనకు ' శశిశ్రీ ' అని నామకరణం చేశారు.శశిశ్రీ చివరి రోజుల్లో తనగురువు గారి జీవిత చరిత్రను వ్రాసి, విద్యార్థులకు అది ఎంతో ఉపయోగకరంగా ఉండాలని కాలేజీలెన్నో తిరిగి, ప్రసంగించి, తన అనర్ఘళమైనఉపన్యాసంతో విద్యార్థులను వుర్రూతలూగించారు.        పుట్టపర్తి నారాయణా చార్యుల వద్ద ప్రాచీన సాహిత్యం, వైసివిరెడ్డి, డా.గజ్జెల మల్లారెడ్డి ఆచార్య కేతువిశ్వనాధరెడ్డి ద్వారా అభ్యుదయ సాహిత్యాన్ని బహుముఖంగా అధ్యయనం చేశారీయన. దాదాహయాత్, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి పాలగిరి విశ్వప్రసాద్, ఖలందర్, మహమూద్, ర...

రాయలసీమ దళిత జీవితం, సాహిత్యం

రాయలసీమ  దళిత జీవితం, సాహిత్యం        __కిన్నెర శ్రీదేవి (సేకరణ: పిళ్లా విజయ్)                 చాతుర్వర్ణ  హిందూమత వ్యవస్థలో ఏ స్థాయిలోనూ చోటులేక సాంఘిక జీవన చట్రం చివరి అంచులకు నెట్టబడి వెలిగా జీవించవలసిందిగా నిర్దేశింపబడిన వాళ్లు దళితులు. అంబేద్కరిజం పునాదిగా దళితవాదం రూపు దిద్దుకొంది.కులాన్ని కేవలం ఒక సాంఘిక విషయంగా కాక ఒక రాజకీయ ఆర్థిక దళిత వాదంలో ప్రధానమైంది దళిత అణచివేత రాజకీయాలు ప్రాతిపదికగా దళిత సాహిత్యం వచ్చింది               రాష్ట్రంలో దళిత ఉద్యమం దశదిశలా వ్యాపించినప్పటికీ, రాయలసీమలో  మాత్రం ఆ ఉద్యమం తలెత్తడం, విస్తరించడం. దళిత చైతన్యం పెరగడం వంటి అంశాలను  అంతగా పట్టించుకోలేదు. వర్తమాన దళిత ఉద్యమం గురించి తెలిసినంతగా రాయలసీమలో సంఘసంస్కర ణోద్యమకాలంలో హరిజనాభ్యుదయం  (దళితుల)పేరిట జరిగిన కార్యాచరణలు, వాళ్ళ గుర్తింపు కోసం కానీ, చైతన్యం కోసం కానీ చేసిన కార్యక్రమాలేవీచరిత్రలోకి ఎక్కలేదు. రాయలసీమ దళిత జీవితానికి సంబంధించిన వివిధ అంశాలు, దళితుల సామాజిక రాజకీయ స్థితిగ...

రాయలసీమ మొదటి కథ

*రాయలసీమ మొదటి కథ*     _అప్పిరెడ్డి హరినాథ్ రెడ్డి (సేకరణ:పిళ్లా విజయ్ 9490122229)         ఆధునిక రాయలసీమ కథా సాహిత్యంలో కె.సభా ను ఒక కొండగుర్తుగా చెప్పవచ్చు. కె.సభాకు ముందు, తరువాత రాయలసీమ కథాసాహిత్యం అని స్థూలంగా విభజించు కోవచ్చు. కె. సభా 1944 ఏప్రిల్ నెలలో చిత్రగుప్త పత్రికలో రాసిన ' కడగండ్లు ' కథ మొదలుకొని తరువాత కాలంలో 300 దాకా కథలు రాసి సీమ కథా సాహిత్యంలో చెరగని ముద్రవేశాడు. కథాసాహిత్యంలో తరువాత తరాలని ప్రభావితం చేసి ఆదర్శప్రాయుడయ్యాడు.               సభా అనంతరం రాయలసీమ కథాసాహిత్యంలో చాలా మార్పులు, పరిశోధనలు జరిగాయి. 1980 ల నుండి రాయలసీమ ప్రాంతీయ అస్థిత్వం ఆధారంగా సాహిత్య, సామాజిక, రాజకీయ రంగాలలో పెద్ద ప్రయత్నమే జరిగింది. స్వాతంత్ర్యానికి పూర్వం రాయలసీమలో వెలువడిన సాహిత్యం సరైన క్రమంలో నిక్షిప్తం కాలేదు. కథాసాహిత్య ప్రక్రియలో ఈ లోటు మరింత స్పష్టంగా కనిపిస్తుంది.గతానికి సంబంధించి లభిస్తున్న కొద్ది సమాచారాన్నైనా క్రోడీకరించి భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది.            ప్రాచ...

చిత్తూరు జిల్లా - వందేళ్ళ కథా సారథులు

          చిత్తూరు జిల్లాలో ఆధునిక కథానికకు ఆద్యుడు సి.రాజగోపాలు నాయుడు.ఆయన కథకులుగానే కాక ఆధునిక సాహిత్య ఒరవడికి తెరతీసిన వ్యక్తి. నాటకాలు , వ్యాసాలు , కథలు , నవలలు  ఎక్కువగా వ్రాయడమేకాక విమర్శనా గ్రంథాలు వెలువరించిన వ్యక్తిగా కూడా వారికి మంచి గుర్తింపు వుంది .  చిత్తూరు జిల్లా నడిబొడ్డున ఒక రాజకీయ పాఠశాలను నడిపారు.  చిత్తూరు జిల్లా కళాపరిషత్ ను ఏర్పాటు చెయ్యడం ద్వారా జిల్లా యువకులలో చైతన్యవంత మైన కదలికను తీసుకువచ్చి ఎందరినో కథకులుగా తీర్చిదిద్దారు.           చిత్తూరు జిల్లాలో ఆ రోజుల్లో ఆధునిక పత్రిక అంటే 'నాగేలు'. రైతుల సమస్యల్ని దృశ్యమానం చెయ్యడం కోసం పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి  ఆ పత్రికను నెలకొల్పారు . పి . రాజగోపాలు నాయుడు ఈ పత్రికకు సంచాలకత్వం వహించారు . రైతు సమస్యలమీద వారిరువురూ వెలువరించిన రైతు కథలు ఆ పత్రికలో వచ్చాయి .          రాయలసీమకు చెందిన తొలి కథకునిగా,ఆధునిక కథకునిగా గుర్తింపు పొందిన ఈ జిల్లా రచయిత కె.సభా రాసిన మొట్టమొదటి కథ ' కడగండ్లు ' 1944 ఏప్రిల్ నెలలో చిత్రగుప్త అనే ప...

సొదుం జయరాం

సొదుం జయరాం              __ పిళ్లా విజయ్,9490122229             సొదుం జయరాంను సీరియస్ రచయితలందరూ గొప్పరచయితగా పేర్కొంటారు. ఫ్రాన్స్ రచయిత గైడీమపాసా ప్రభావం తన కథల మీద వుందనీ ఆయన చెప్పేవాడు. అందువల్లనే ఆయన కథలన్నీ నిరాడంబరంగా అత్యంత సంక్షిప్తంగా వుంటాయి. ఒక్కపదం, ఒక్క అక్షరం కూడా వృథాగా వుండకూడ దంటాడాయన. రా.రా. శిష్యవర్గంలో గురువును మించిన శిష్యుడాయన. ఆయన రాసిన 'వాడిన మల్లెలు" కథను రా.రా. ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. రా.రా.వంటి విమర్శకుల సహచర్యం ఆయనను గొప్ప రచయితగా తీర్చిదిద్దింది. పాలగిరి విశ్వప్రసాద్ వంటి శిష్యుల సహకారం వల్ల, దాదాహయాత్, సన్నపురెడ్డి  వెంకటరామిరెడ్డి, శశిశ్రీ, డి.రామచంద్రరాజు సహవాసంవల్ల సొదుం జయరాం చివరి రోజుల్లోనూ కథలు వ్రాశారు. శశిశ్రీ సంపాదకులుగా ఉన్న “సాహిత్యనేత్రం" త్రైమాస పత్రికలో ఆయన కథలు వరుసగా ప్రచురింపబడ్డాయి. 'విపుల' 'సాహితి' వంటి మాస పత్రికల్లో ఆయన కథలు వచ్చాయి. ఆయన 'మర్యాదస్తులు' కథానిక ఒక్కటి చాలు, ఆయన గొప్ప కథకుడనీ చెప్పడానికీ! ఈ కథ అంతర్జాతీయ స్థాయికి చెందిన కథ.వందలాది కథలు రాసిన రచయితల...

ఎం.రాజేంద్ర

ఎం.రాజేంద్ర                                              _ సేకరణ: పిళ్లా విజయ్                                                  9490122229             పాత్రికేయులు . కథాభిమాని . స్వస్థలం చిత్తూరు జిల్లా , మొదట ఆంధ్రప్రభ దినపత్రికలోనూ ఆ తర్వాత తెలుగు ఇండియా టుడే పత్రికలోనూ పని చేశారు . వీరి హయాంలో ఇండియా టుడేలో వెలువడే కథలకు పాఠకలోకంలో మంచి గౌరవం స్థిరపడింది . వీరి ఆధ్వర్యంలో వెలువడ్డ ఇండియా టుడే ప్రత్యేక సాహిత్య సంచికల కోసం సాహితీ లోకం ఎదురు చూసేదనడంలో అతిశయోక్తి లేదు . ప్రస్తుతం హైదరాబాద్లో విశ్రాంత జీవితం గడుపుతున్నారు .                          ( మహమ్మద్ ఖదీర్ బాబు_ ఇలా కూడా కథలు రాస్తారు నుండి)

హెచ్చార్కె

హెచ్చార్కె                                   _ సేకరణ: పిళ్లా విజయ్                                            9490122229           కవి , రచయిత , పాత్రికేయులు . ప్రజా ఉద్యమాలని , సాహిత్యాన్ని జీవితంగా చేసుకున్న తరంలో ఒకరు . స్వస్థలం కర్నూలు జిల్లా , విప్లవోద్యమంలో పన్నెండేళ్లు పని చేసి  రెండేళ్లు జైలు జీవితం అనుభవించారు . విరసంలో చరుకుగా పని చేశారు . ఆ తర్వాత పాత్రికేయునిగా ప్రస్థానం . ఈనాడు దినపత్రికలో కీలక బాధ్యతలు పోషించి స్వచ్ఛంద విరమణ పొందారు . ఒక్కొక్కరాత్రి , నకులుని ఆత్మకథ .... తదితరం ఈయన కవితా సంపుటాలు . చేతికిరాని కొడుకు , కొండార కోట , అల్ ఫతా హోటల్ తదితర కథలతో ప్రశంసలు పొందారు . కవి , రచయిత్రి జయవీరి సహచరి . కుమార్తె మమత కూడా కవిత్వం రాస్తారు . పూర్తి పేరు కొడిదెల హనుమంతరెడ్డి . వయసు 64 సంవత్సరాలు . నివాసం అమెరికా- ఇండియా .  ( మహమ్మద్ ఖదీర్ బాబు_...

గోపిని కరుణాకర్

గోపిని కరుణాకర్  _ సేకరణ: పిళ్లా విజయ్                               9490122229               రచయిత . 1990 లలో మొదలైన ప్రతిభా వంతులైన రచయితలలో ఒకరు. స్వస్థలం చిత్తూరు జిల్లా పీలేరు . మొదట మద్రాసులో అత్వూత హైదరాబాద్ లో చిత్ర పరిశ్రమలో పని చేస్తున్నారు . జానపద కథాకథన ధోరణికి ప్రాముఖ్యం తెచ్చిన రచయిత . " భారతం బొమ్మలు , 'దీవం చెప్పిన కతలు' వీరి కథా సంకలనాలు.'తిరుమల కొండ కతలు' అముద్రితం  ( మహమ్మద్ ఖదీర్ బాబు_ ఇలా కూడా కథలు రాస్తారు నుండి)

దాదాహయత్

దాదాహయత్                                 _ సేకరణ: పిళ్లా విజయ్                                    9490122229                               ‌            రచయిత  . తెలుగు కథకుల్లో  వస్తువు ' శైలి , శిల్పం ' , ఈ మూడింటిపై పట్టువున్న    కొద్దిమంది రచయితల్లో ఒకరు.  మురళి  ఊదే పాపడు '  మసీదు , పావురం  వంటి  ప్రసిద్ధమైన  కథలు  ఎన్నో రాశారు . . స్వస్థలం: కడప జిల్లా . వృత్తిరీత్యా న్యాయవాదిగా ప్రొద్దుటూరులో స్థిరపడ్డారు. ( మహమ్మద్ ఖదీర్ బాబు_ ఇలా కూడా కథలు రాస్తారు నుండి)

డా.కేశవరెడ్డి

డా.కేశవరెడ్డి                       ‌‌            సేకరణ: పిళ్లా విజయ్                                    9490122229             నవలా రచయిత . తెలుగు నవలా సాహిత్యంలో ప్రముఖ స్థానం సంపాదించు కున్నారు.  స్వస్థలం:చిత్తూరు. జీవితం తెలుగు జిల్లా గడిచింది నవలా . కాని  వైద్య  వృత్తిలో  భాగంగా నిజామాబాద్ డిచ్ పల్లి లో చివరివరకూ జీవితం గడిచింది.  జానపద కథా కథనశైలిలో పల్లీయపదాలను శిష్ట్ల వ్యవహారికాన్నీ కలగలపి ఆయన  కథ  చెప్పే  తీరు పాఠకులకు  విశేషంగా  నచ్చింది . బీర సాగు గురించి దోపిడీ కి గురైన వర్గాల గురించి తాత్త్విక స్థాయిలో గాఢమైన లోతుల్లో చర్చించిన రచయితగా చెప్పుకోవచ్చు రచన ఒకటి ఒకటి కాకుండా నిజ జీవితంలో కూడా నిరాడంబరంగా ఉంటూ వ్యాధిగ్రస్తులకు వైద్యం చేస్తూ జీవించారు                 అతడు  అడవిని...

రమణజీవి

*రమణజీవి*           ‌           ‌‌        ‌‌ ‌ _ సేకరణ: పిళ్లా విజయ్                                         9490122229               రచయిత, కవి, చిత్రకారులు. తెలుగు సాహిత్యంలో మూసకు ఆవల ఉండే సృజనకు ప్రయత్నించారన్న గుర్తింపు పొందారు. 'నలుగురు పాండవులు' వీరి కవితాసంపుటి. 'ఒత్తుథ కథలు', 'సింహాల పేట' వీరి కథా సంపుటాలు. తెలుగులో వంద లాది సాహిత్య పుస్తకాలు వీరి ముఖచిత్రాలంకరణతోనే రూపు దిద్దుకుంటు న్నాయి.స్వస్థలం అనంతపురం. వయసు 60 సంవత్సరాలు.  ( మహమ్మద్ ఖదీర్ బాబు_ ఇలా కూడా కథలు రాస్తారు నుండి)

ప్రథమ దళిత కథ

*రాయలసీమ నుండి వచ్చిన మొట్టమొదటి దళిత కథ*  *' చిరంజీవి 'కథఅని కిన్నెర శ్రీదేవి భావించారు.కానీ కొత్త గా చేసిన పరిశోధన లో తెలిసిన విషయం ఏమంటే ఈ కథ కంటే ముందే   ఆదిమాంధ్ర భక్తుని జీవిత చరిత్ర   అనే కథను 1928లోనే  శ్రీరాములు రెడ్డి రాసినట్లు దానిని సీమకథా శిలాజాలు లో(రాయలసీమ తొలితరం కథలు 1927-1930) తప్పెట రామచంద్రారెడ్డి సంకలనం చేసినట్లు తెలుస్తోంది. ఈ కథలను తవ్వా వెంకటయ్య వెలికి తీశారు*        గుత్తి రామకృష్ణ రాసిన 'చిరంజీవి'కథ సాధన పత్రికలో 1941 మార్చి 26 సంచికలో ప్రచురించబడింది.ఇది  దళిత కథ. అగ్రవర్ణ వ్యవసాయ దారులు  దళితులకు అప్పులిచ్చి వడ్డీ మీద వడ్డీలు లెక్కలు కట్టి వాళ్ళతో వంశపారంపర్యంగా వెట్టి చాకిరీ చేయించుకొనే భూస్వామ్య దుర్మార్గాన్ని ఈ కథ బట్టబయలు చేస్తుంది . దళితులకు  స్వంత జీవితమే లేకుండా చేసిన సాంఘిక , ఆర్థిక పరిస్థితుల్ని ఈ కథ చిత్రించింది .               వెంకటరాముని ముత్తాత తన పెండ్లికి రెడ్డి దగ్గర అప్పుచేస్తాడు . ఆ అప్పు తీర్చడానికి ముత్తాత , తాత , తండ్రుల తరాలు గడిచి పో...

రాయలసీమ లో ఫ్యాక్షనిజం

*రాయలసీమ లో ఫ్యాక్షనిజం*             ___ కిన్నెర శ్రీదేవి          ఫ్యాక్షనిజం అనేది ఒకప్పుడు ఆస్తుల ధ్వంసానికి, పంటల్ని నాశనం చేయటానికి పరిమితమై ఉండగా ఇవ్వాళ పరస్పరం హత్యలు చేసుకొనేదాకా విస్తరించింది. బాంబుల తయారీ కుటీర పరిశ్రమగా పరిణమించింది. ఫ్యాక్షన్ గ్రామాలలో అరాచకం పెరిగిపోయింది. పల్లెలు నివాస యోగ్యాలు కాకుండా పోయాయి. ఆర్థికంగా బలపడిన వాళ్ళంతాపల్లెల్ని విడచి, రాజధానికో లేకపోతే, దగ్గరగా ఉన్న నగరానికో, పట్టణానికో వలస పోతున్న క్రమం కూడా ఇవ్వాళ కన్పిస్తోంది.           ఫ్యాక్షన్ చర్యలలో పాల్గొనేవాళ్ళకు రాజకీయనాయకులు ఆసరా ఇవ్వటమే కాకుండా, వాళ్ళే స్వయంగా ఫ్యాక్షన్లను నడపడం సర్వసాధారణ విషయమై పోయింది. పోలీసు వ్యవస్థ ఈ ఫ్యాక్షన్ రాజకీయాల్ని నియంత్రించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయినా సరే ఫ్యాక్షన్ చర్యల వల్ల పెంచుకున్న పరిధినిరాజకీయ నాయకులు ఎన్నికల్లో ఉపయోగించు కుంటున్నారు. అంతే కాకుండా ఈఫ్యాక్షనిస్టులు తమ పల్లెల్లో రిగ్గింగ్ చేసి ఎన్నికల్లో నెగ్గుతున్నారు. నిజానికి ఇవ్వాళ రాయలసీమ లోని రాజకీయ కుటుంబాలు చాల...

ప్రథమ దళిత కథ

*రాయలసీమ నుండి వచ్చిన మొట్టమొదటి దళిత కథ ' చిరంజీవి 'కథ*               ___కిన్నెర శ్రీదేవి        గుత్తి రామకృష్ణ రాసిన 'చిరంజీవి'కథ సాధన పత్రికలో 1941 మార్చి 26 సంచికలో ప్రచురించబడింది.ఇది రాయలసీమలో మొట్టమొదటి దళిత కథ.అగ్రవర్ణ వ్యవసాయదారులు  దళితులకు అప్పులిచ్చి వడ్డీ మీద వడ్డీలు లెక్కలు కట్టి వాళ్ళతో వంశపారంపర్యంగా వెట్టి చాకిరీ చేయించుకొనే భూస్వామ్య దుర్మార్గాన్ని ఈ కథ బట్టబయలు చేస్తుంది . దళితులకు  స్వంత జీవితమే లేకుండా చేసిన సాంఘిక , ఆర్థిక పరిస్థితుల్ని ఈ కథ చిత్రించింది .               వెంకటరాముని ముత్తాత తన పెండ్లికి రెడ్డి దగ్గర అప్పుచేస్తాడు . ఆ అప్పు తీర్చడానికి ముత్తాత , తాత , తండ్రుల తరాలు గడిచి పోయాయి . వాళ్ళ తరువాత వెంకట్రాముని వంతు వచ్చింది . ఆ కుటుంబంలోని ఆడవాళ్ళు , పిల్లలు కూడా అతనితో పాటు పనిచేసినా ఆ అప్పు మాత్రం తీరదు . ఒక రోజు జబ్బుతో ఉన్న వెంకట్రాముని తల్లి పనిలోకి రాలేదని అతన్ని మాటలతోనూ , చేతలతోనూ హింసిస్తాడు రెడ్డి. తనలాంటి ఆధిపత్య కులాల దౌష్ట్యానికి ఉదాహరణగా...